మచిలీపట్నం:
స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకుడు స్వర్గీయ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణం కోసం కృష్ణాజిల్లా కలెక్టర్ ను మచిలీపట్నంలో రెండు ఎకరాలు స్థలం కేటాయిస్తూ ప్రతిపాదనలు పంపమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం పట్ల పట్టాభి స్మారక భవన నిర్మాణ కమిటీ హర్షం వ్యక్తం చేసింది.
బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్ ఆధ్వర్యంలో గురువారం పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పట్టాభి స్మారక భవన నిర్మాణ కమిటీ సభ్యులు పాలాభిషేకం చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మంత్రి కొల్లు రవీంద్ర కు, ఎంపీ, వల్లభనేని బాలసౌరి, ఆర్టీసీ చైర్మన్, కొనకళ్ళ నారాయణరావు, జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి, బండి రామకృష్ణ, బిజెపి మచిలీపట్నం నియోజకవర్గ కన్వీనర్, సోడిశెట్టి బాలాజీ లకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపీచంద్, పట్టాభి స్మారక భవన నిర్మాణ కమిటీ సభ్యులు, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, ఎం. సుబ్రహ్మణ్యం, నిమ్మగడ్డ శ్రీధర్, సూరిశెట్టి హరికృష్ణ, బొడ్డు నాగరాజు, ఆళ్ల మాధవ, పి. ఎస్ ఎస్ ఆర్ శర్మ, గండికోట అంజిబాబు, లోల్లా కుటుంబ శాస్త్రి, తంగిరాల మిధున వ్యాస్, చోడవరపు లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment