Skip to main content

బుధవారం నాగాయలంకలో ప్రజా దర్బార్



అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *ప్రజా దర్బార్* కార్యక్రమం రేపు నాగాయలంకలో నిర్వహించనున్నారు.

*వేదిక:-*
నాగాయలంక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరం

*సమయం:-*

బుధవారం ఉదయం 10 గంటల నుంచి 12గంటల వరకు 

*ఈ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీ పెనుమూడి సాయిబాబు విచ్చేయనున్నారు*

మండలంలోని అన్ని శాఖల డివిజన్, మండల అధికారులు, పంచాయతీ ఈఓలు, కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 

మండల పరిధిలోని గ్రామాల ప్రజలు తమ తమ సమస్యలు, వినతులు ఎమ్మెల్యే గారి దృష్టికి వినతిపత్రాల రూపంలో తీసుకువచ్చి పరిష్కారాలు పొందగలరు.

Comments